Fri Dec 27 2024 14:22:58 GMT+0000 (Coordinated Universal Time)
TDP : పులివెందులలో బ్యాలట్ పద్ధతిలో ఎన్నికలకు వెళదాం
వైసీపీ అధినేత వైఎస్ జగన్కు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్కు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. దమ్ముంటే జగన్ పులివెందులలో రాజీనామా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పులివెందులలో జరిగే ఉప ఎననికల్లో బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికలకు వెళ్దామని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. మొన్న వచ్చిన మెజారిటీ కూడా జగన్కు వస్తుందా అని ప్రశ్నించారు.
గెలవడమే...
అసలు జగన్ గెలుస్తారో లేదో చూద్దాం అంటూ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో జగన్కు 151 సీట్లు వస్తే అది విజయమా.... అదే తమకు 164 సీట్లు వస్తే ఈవీఎంలపై మాట్లాడతారా అంటూ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా జగన్ చిలక జోస్యం ఆపాలని, ఓటమికి అసలు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న కోరారు.
Next Story