Fri Dec 27 2024 13:39:26 GMT+0000 (Coordinated Universal Time)
Kodali Nani : కొడాలి నానిని బుద్దా వెంకన్న అంత మాట అనేశాక... ఇక?
మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు
మాజీ మంత్రి కొడాలి నాని అంటే తెలుగుదేశం పార్టీ నేతలకు చిర్రెత్తుకొస్తుంది. అధికారంలో లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నారు కానీ కొందరు నేతలైతే కొడాలి నానిని ఎప్పుడు కార్నర్ చేయాలా? అని కాసుకుని కూర్చుంటారు. తమ అధినేత, ఆయన కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసే కొడాలి నాని కామెంట్స్ కౌంటర్ ఇచ్చేందుకు కూడా కొందరు సిద్ధపడరు. ఆయనంతేలే అని వదిలేసి ఊరుకుంటారు.
రేబిస్ ఇంజక్షన్లు...
అయితే విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాత్రం కొడాలి నాని అంటే ఒంటికాలి మీద లేస్తారు. కొడాలి నానిని పిచ్చికుక్కగా ఆయన ఎప్పుడూ అభివర్ణిస్తుంటారు. తాజాగా బుద్ధా వెంకన్న మరోసారి కొడాలి నాని పై ఫైర్ అయ్యారు. గుడివాడకు తాము ఐదు రేబిస్ ఇంజక్షన్లు పంపుతున్నామని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. పిచ్చికుక్క కరిచి అరుస్తున్న కొడాలి నానిని ఆ ఇంజక్షన్లు చేయించుకోవాలని బుద్దా వెంకన్న చెప్పారు. దీంతో మరోసారి మాటల యుద్ధం వైసీపీ, టీడీపీ నేతల మధ్య ప్రారంభమయిందనే చెప్పాలి.
Next Story