Fri Dec 20 2024 17:31:21 GMT+0000 (Coordinated Universal Time)
ఓడిన 24 గంటల్లో కొడాలి నాని శవం
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మంత్రి కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మంత్రి కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇంటి గేటు తాకితే కొడాలి నాని శవాన్ని పంపుతామని ఆయన హెచ్చరించారు. 2024లో గుడివాడలో కొడాలి నాని ఓడిపోయిన అరగంటలో ప్రజలు చంపుతారని బుద్దా వెంకన్న హాట్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రా చూసుకుందామని ఆయన కొడాలి నానికి సవాల్ విసిరారు.
రాజకీయ బిక్ష....
కొడాలి నానికి రాజకీయ బిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీయేనని బుద్దా వెంకన్న అన్నారు. కొడాలి నానికి టిక్కెట్ ఇచ్చి చంద్రబాబు పొరపాటు చేశారన్నారు. కొడాలి నాని భాష ఏంటి? ఆయన చరిత్ర ఏంటి? ఇష్ట మొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని బుద్దా వెంకన్న హెచ్చరించారు. క్యాసినో వ్యవహారంలో 250 కోట్లు చేతులు మారాయని, ఇందులో డీజీపీ వాటా ఎంత అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
Next Story