Mon Dec 23 2024 11:17:54 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి
మాజీ కేంద్ర మంత్రి కిళ్ళి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు
మాజీ కేంద్ర మంత్రి కిళ్ళి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడప జిల్లాలో ప్రచారంలో భాగంగా కిళ్ళి కృపారాణికి కండువా కప్పి షర్మిల కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కడప పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తున్న షర్మిల వద్దకు చేరుకున్న కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ సందదర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
జగన్ కోసం కష్టపడ్డా...
జగన్ కోసం ఎంతో కష్టపడ్డానని, ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టానని చెప్పారు. అలాంటి తనను జగన్ పక్కన పెట్టారన్న కృపారాణి కష్టపడ్డా తనకు గుర్తింపు లేదని చెప్పారు. తమకు వైఎస్సార్ దేవుడు అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ది అని అన్నారు. వైఎస్సార్ ను వైఎస్ షర్మిల లో చూస్తున్నామని అన్నారు. షర్మిలమ్మ న్యాయకత్వం లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తుందని, జగన్ ఒక నియంత అని, ఈ నియంత ను గద్దె దించాలని, షర్మిలమ్మ కి కడప ఎంపీగా ఇక్కడ ప్రజలు అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు.
Next Story