Mon Dec 23 2024 11:38:19 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ చర్చిస్తే.. మేము సిద్ధమే
జనసేన, బీజేపీ పొత్తుపై మాజీ కేంద్ర మంత్రి పురంద్రీశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు
జనసేన, బీజేపీ పొత్తుపై మాజీ కేంద్ర మంత్రి పురంద్రీశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమాలను వేర్వేరుగా చేసుకుంటున్నా బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుందని చెప్పారు. మిత్రుడిగా పవన్ కల్యాణ్ తమతో చర్చలు జరిపితే తాము కూడా స్పందిస్తామని పురంద్రీశ్వరి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పాలన అరాచకంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
విశాఖ ఉక్కుపై.....
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణపై వైసీపీ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అయితే తాము రాష్ట్ర పార్టీగా విశాఖ ఉక్కు విషయంలో ఇక్కడి సెంటిమెంట్ ను కేంద్రంలోని పెద్దలకు వివరిస్తామని చెప్పారు. పెట్రోలు, డీజిల్ ఛార్జీలు కొన్ని అనివార్య కారణాలతో పెరుగుతున్నాయని, అయినా కేంద్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ధరలను తగ్గించిందని పురంద్రీశ్వరి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.
Next Story