Sun Dec 14 2025 23:34:59 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కేశినాని నాని షాకింగ్ డెసిషన్.. ఓటమి తర్వాత?
విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని ఆయన ఎక్స్ ద్వారా తెలియజేశారు. రెండుసార్లు తనను విజయవాడ ఎంపీగా గెలిపించన విజయవాడ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రత్యక్ష రాజకీయాల నుంచి...
అయితే తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ విజయవాడ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పనిచేసేందుక సహకరిస్తానని కేశినేని నాని తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో సహకరించి తనకు అన్నివిధాలుగా మద్దతుదారులుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా కేశినాని నాని 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించి, 2024లో వైసీపీ తరుపున పోటీ చేసి తమ్ముడు కేశినేని శివనాధ్ పై ఓటమి పాలయ్యారు.
Next Story

