Thu Dec 19 2024 18:16:13 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ఎంపీ ఎంవీవీకి ఇక ఆప్షన్ అదేనట
విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
విశాఖపట్నం మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. హయగ్రీవ సంస్థ భూముల వ్యవహారంలో మాజీ ఎంపీపై కేసు నమోదు కావడంతో ఆయన తనపై నమోదయిన కేసును కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
హైకోర్టులో వేసిన క్వాష్ పిటీషన్ ను...
ఎంవీవీ సత్యనారాయణ వేసిన క్వాష్ పిటీషన్ ను పరిశీలించిన హైకోర్టు కేసు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న తెలిపింది. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
Next Story