Mon Dec 23 2024 12:33:27 GMT+0000 (Coordinated Universal Time)
Free Gas Cyllender : ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలా? అయితే ఈ మూడు పత్రాలున్నాయా?
ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం రేపటి నుంచి ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం రేపటి నుంచి ప్రారంభం కానుంది. నిన్నటి నుంచి గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. తొలి రజు నుంచి మంచి స్పందన కనిపించింది. వేలాది మంది తమకు ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలంటూ గ్యాస్ కంపెనీల వద్దకు వచ్చి బుక్ చేసుకుని వెళ్లారు. అయితే ఇప్పటికే అనేక మందికి సందేహాలున్నాయి. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే అర్హతలేంటి? బుక్ చేసుకోవడానికి ఏ ఏ పత్రాలు అవసరమవుతాయన్న సందిగ్దం అనేక మందిలో ఉంది. ఏడాదికి మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. దీపావళి రోజున చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఎదురు చూస్తున్న...
అయితే ఈ గ్యాస్ సిలిండర్ తమకు ఉచితంగా అందుతుందా? లేదా? అన్న సందేహం అనేక మందిలో ఉంది. తొలి విడతలోనే తమకు అందితే చాలు.. ఇక మూడు సిలిండర్లు ఏడాది పొడువునా లభిస్తాయని, ప్రతి ఏటా రెండున్నరే వేల రూపాయలు మిగిలే అవకాశముండటంతో దాదాపు ఆంధ్రప్రదేశ్ లోని 1.50 కోట్ల మంది ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఇక గ్యాస్ కు ఢోకా ఉండదన్న భావన ఉండటం వల్ల ఈ పథకానికి తాము అర్హులమా? కాదా? అన్న సందేహంలో ఉన్నారు. తమకు అన్ని అర్హతలుండీ ఉచిత గ్యాస్ సిలిండర్ అందకపోయినా, నగదు జమ కాకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1967 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయవచ్చు.
ఏవేవి అవసరం అంటే?
అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే మూడు పత్రాలు అవసరం. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ధరఖాస్తు దారుని వద్ద ఎల్పీజీ కనెక్షన్, ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఎప్పటిలాగే మొబైల్ నంబర్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత 24 గంటల్లో గ్రామాల్లో.. రెండు రోజుల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది. ఒకవేళ సిలిండర్ డెలివరీ సమయంలో గ్యాస్ డెలివరీ ఏజెంట్ డబ్బులు తీసుకుంటే రెండురోజుల్లో లబ్దిదారుల ఖాతాల్లో 851 రూపాయలు ప్రభుత్వం నుంచి జమ అవుతుంది. డబ్బులు జమ అయినట్లు లబ్దిదారుల ఖాతాలకు మెసేజ్ కూడా వస్తుంది. మెసేజ్ రాకపోయినా టోల్ ఫ్రీ నెంబరు కు డయల్ చేయవచ్చు.
ఈ విధంగా చేయాలి...
ప్రతి లబ్దిదారుడు ఈ కేవైసీ చేయాలి..గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని డీలర్ వద్దకెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాలి. ఈ కేవైసీ చేసిన తర్వాత రెండు, మూడు రోజుల్లో అప్ డేట్ అవుతుంది. ఆ లోపు సిలిండర్ వస్తే డబ్బులు చెల్లించాలి. కేవైసీ పూర్తయిన తర్వాత.. సిలిండర్‌కు లబ్దిదారుడు ఇచ్చిన నగదు వారి ఖాతాలో జమ అవుతుంది. ఫ్రీ గ్యాస్ సిలిండర్‌కు సంబంధించి సమస్య ఉంటే 1967 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. మొదటి సిలిండర్ మార్చి 31వ తేదీ లోపు బుక్ చేసుకోవాలి. రెండో సిలిండర్ జూలై 31వ తేదీ లోపు బుక్ చేయాల్సి ఉంటుంది. చివరి సిలిండర్ నవంబర్ 30వ తేదీలోపు బుక్ చేయాల్సి ఉంటుంది
Next Story