Mon Dec 23 2024 07:16:31 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వం మారినా డోలీ మోత తప్పడం లేదుగా
అల్లూరి జిల్లా పెదబయలు మండలం కుంబుర్ల గ్రామానికి చెందిన గంగమ్మ విశాఖలోని కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మరణించింది
ప్రభుత్వాలు మారినా వారికిచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ప్రేమ ఒలకబోసే రాజకీయ నేతలు ఎన్నికలు పూర్తయి అధికారంలోకి రాగానే ఆ ఊసే మర్చి పోతారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు తప్పడం లేదు. గర్భవతులను, తీవ్ర అనారోగ్యానికి గురయిన వారిని డోలీలోనే తీసుకెళ్లాలి. తమ గ్రామాలకు రవాణా సౌకర్యంల లేపోవడంతో వాహనాలు రావు. కనీసం అంబులెన్స్ కూడా అక్కడకు చేరుకోని పరిస్థితుల్లో గిరిపుత్రులు డోలీని ఆశ్రయిస్తున్నారు.
మృతదేహాన్ని...
తాజాగా అల్లూరి జిల్లా పెదబయలు మండలం కుంబుర్ల గ్రామానికి చెందిన గంగమ్మ విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమెను తమ సొంత ఊరికి తీసుకెళ్లేందుకు వాహనాలు వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు డోలీలో మృతదేహఆన్ని తీసుకెళ్లారు. కేజీహెచ్ నుంచి కొత్తూరు వరకూ అంబులెన్స్ లో తెచ్చినా అక్కడిన నుంచి సొంత గ్రామమైన పెద బయలు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో యువకులు మృతదేహాన్ని డోలీలో తీసుకెళ్లారు. వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది వైరల్ గా మారింది. పాలకులు ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతాల్లో అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
Next Story