Sun Dec 22 2024 19:00:01 GMT+0000 (Coordinated Universal Time)
భయపడం.. బెదరం.. దమ్ముంటే రా
యార్లగడ్డ వెంకట్రావు తనను కొడాలి నానిని విమర్శించడం తగదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు.
యార్లగడ్డ వెంకట్రావు తనను కొడాలి నానిని విమర్శించడం తగదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తాను ఎవరికీ భయపడేది లేదన్నారు. ఏదైనా అభ్యంతరం ఉంటే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడుకోవచ్చని వంశీ సూచించారు. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులు వైసీపీ పెట్టిన తర్వాతే పార్టీలో చేరిన వారేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తాను పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసినప్పుడు కార్యాలయాన్ని తీసివేయలేదని, యార్లగడ్డ మాదిరి ఇంట్లో దాక్కోలేదన్నారు.
ఎందరు వచ్చినా...
తెలుగుదేశం పార్టీ నేతల తాటాకు చప్పుళ్లకు తాను భయపడబోనని తెలిపారు. ఉడత ఊపులకు బెదిరిపోనని చెపపారు. చంద్రబాబు, లోకేష్ లు ఎంత మంది వచ్చినా తనను, నానిని ఏమీ చేయలేరన్నారు. దమ్ముంటే లోకేష్ తనపై గన్నవరంలో పోటీ చేయాలని కోరారు. ముందు మంగళగిరిలో లోకేష్, కుప్పంలో చంద్రబాబు గెలిచేలా చూసుకోమని ఎద్దేవా చేశఆరు. తాము కూడా టీడీపీ యూనివర్సిటీలో చదువుకుని గ్రాడ్యుయేట్లు అయిన వారిమేనని వంశీ అన్నారు.
Next Story