Sun Dec 22 2024 06:52:42 GMT+0000 (Coordinated Universal Time)
Vallabhaneni Vamsi : భువనేశ్వరిని నేను అన్నానా.. అవన్నీ ఉత్తమాటలే
నారా భువనేశ్వరిని తాను ఎన్నడూ ఒక్క మాట అనలేదని గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ అన్నారు
నారా భువనేశ్వరిని తాను ఎన్నడూ ఒక్క మాట అనలేదని గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ అన్నారు. తాను అన్నట్లు ఎక్కడైనా విన్నారా? అని ఆయన ప్రశ్నించారు. కనీసం తాను అన్నట్లు వీడియో ఉందా? అని అడిగారు. కేవలం టీడీపీ సోషల్ మీడియా వాళ్లు తనపై అలా తప్పుడు వార్తలు రాయించారన్నారు. తాను భువనేశ్వరిని ఏదో అన్నట్లు టీడీపీ సోషల్ మీడియానే చిత్రీకరించిందన్నారు. పవన్ కల్యాణ్ సమాచారం తెలుసుకుని మాట్లాడాలని అన్నారు.
పవన్ తెలుసుకుని మాట్లాడు...
ఎవరో చెప్పినవి విని తనపై ఆరోపణలు చేయడం పవన్ కు సరికాదని ఆయన హితవు పలికారు. తాను అసెంబ్లీలో భువనేశ్వరి గురించి మాట్లాడానని పవన్ అంటున్నారని, అసలు ఆరోజు తాను అసెంబ్లీలోనే లేనని వల్లభనేని వంశీ అన్నారు. తాను అనని మాటలను అన్నానని చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తూ ఒకవర్గం ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారని అన్నారు. కానీ తాను ఏమీ అనకపోయినా క్షమాపణ చెప్పానంటూ వల్లభనేని వంశీ అన్నారు. లోకేష్ కు కూడా తనపై తప్పుడు సమాచారాన్ని కొందరు ఇచ్చారని వంశీ తెలిపారు.
Next Story