Sun Dec 22 2024 23:09:07 GMT+0000 (Coordinated Universal Time)
డొక్క తీసి డోలు కడతాం : వంశీ వార్నింగ్
గన్నవరం వైసీపీ నేతలు దుట్టా రామచ్రందరావు, యార్లగడ్డ వెంకట్రావుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండి పడ్డారు
గన్నవరం వైసీపీ నేతలు దుట్టా రామచ్రందరావు, యార్లగడ్డ వెంకట్రావుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండి పడ్డారు. మాటలు అదుపులో పెట్టుకోవాలని కోరారు. మాట తూలితే డొక్క తీసి డోలు కడతామని హెచ్చరించారు. దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వీడియోలు లీకయిన సంగతి తెలిసిందే. ఇందులో వల్లభనేని వంశీ, కొడాలని నానిలపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
ఫిర్యాదు చేయం....
తాము వారిపై పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేయబోమన్నారు. వారిని ఎలా హ్యాండిల్ చేయాలో తనకు, కొడాలి నానికి తెలుసునని అన్నారు. గన్నవరానికి వలస వచ్చిన నేతలందరూ మాట్లాడే వారేనని ఫైర్ అయ్యారు. గన్నవరం నియోజకవర్గానికి తాను ఏం చేశానో ప్రజలకు తెలుసునని వల్లభనేని వంశీ అన్నారు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో జరగని అభివృద్ధి తన హయాంలో జరిగిందని వంశీ అన్నారు. అలాంటి వారి వ్యాఖ్యలను తాము పట్టించుకోబోమని తెలిపారు. ఎక్కువ మాట్లాడితే వారితో తేల్చుకోగలిగే శక్తి తమకు ఉందని వల్లభనేని వంశీ అన్నారు.
Next Story