Wed Dec 25 2024 13:04:19 GMT+0000 (Coordinated Universal Time)
గంటా మీటింగ్ రానిది అందుకేనట
గంటా శ్రీనివాసరావు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశానికి గైర్హాజరయ్యారు
అవును అనుకున్నట్లే జరిగింది. గంటా శ్రీనివాసరావు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశానికి గైర్హాజరయ్యారు. త్వరలో వచ్చి తాను కలుస్తానని మాత్రం గంటా కబురు పంపారు. ఇప్పటికే తాను కొన్ని కార్యక్రమాలను నిర్ణయించుకుని ఉండటంతో రాలేకపోతున్నానని టీడీపీ కేంద్ర కార్యాలయానికి గంటా శ్రీనివాసరావు సమాచారం ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు మొత్తం 12 నియోజకవర్గాల నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు.
పార్టీ కి దూరంగా....
ఇందుకోసం ప్రత్యేకంగా అందరికీ ఆహ్వానాలు పంపారు. ఈ సమావేశానికి గంటా శ్రీనివాసరావు హాజరు కావాల్సి ఉంది. గత కొంతకాలంగా గంటా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో మాత్రం కొంత యాక్టివ్ గానే ఉన్నా, పార్టీ పరంగా మాత్రం ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారన్న ప్రచారం నేపథ్యంలో అధినేతతో సమావేశానికి దూరంగా ఉండటం మరింత బలం చేకూరుస్తుంది.
Next Story