Tue Dec 24 2024 00:52:21 GMT+0000 (Coordinated Universal Time)
ఎస్మాను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య గ్యాప్ పెరుగుతోంది. ప్రభుత్వం కూడా ఎస్మా ను ప్రయోగించడానికి సిద్ధమయినట్లుగానే ఉంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఉద్యోగులకు నచ్చ చెప్పడానికి జగన్ నియమించిన కమిటీతో కూడా ఉద్యోగులు చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని వారు బహిరంగంగా చెబుతున్నారు. పీఆర్సీపై ప్రభుత్వం విడుడల చేసిన జీవోను రద్దు చేసి, అశుతోష్ మిశ్రా ఇచ్చిన కమిటీ నివేదికను బయటపెట్టిన తర్వాతనే చర్చల విషయం ఆలోచిస్తామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
గత్యంతరం లేని పరిస్థితుల్లో....
మరోవైపు వచ్చే నెల మొదటి వారంలో సమ్మెకు వెళ్లేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వం కూడా ఎస్మా ను ప్రయోగించడానికి సిద్ధమయినట్లుగానే ఉంది. ఎస్సెన్షియల్ సర్వీసెస్ మెయిన్టెయినెన్స్ యాక్ట్ ను అమలు చేయనున్నట్లు తెలిసింది. ఎస్మాను ప్రయోగించిన తర్వాత సమ్మెలు, బంద్ లు వంటివి చేయకూడదు. ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బంది కలగకుండా, అత్యవసర సర్వీసులకు ఆటంకం కలగకుండా ఎస్మాను ప్రయోగిస్తారు. 1981లో ఈ చట్టాన్ని రూపొందించారు. ఆరు నెలల పాటు ఈ చట్టం అమలులో ఉండనుంది. ఈ చట్ట ప్రకారం సమ్మెకు దిగిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.
Next Story