Mon Dec 23 2024 13:33:50 GMT+0000 (Coordinated Universal Time)
గౌతమ్ రెడ్డి చివరి ప్రయాణం ఈ వాహనంలోనే
మేకపాటి గౌతంరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక వాహనాన్ని సిద్ధంచేశారు. దీనిని చెన్నై నుంచి తెప్పించారు
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నెల్లూరు నుంచి ఆయన పార్ధీవ దేహాన్ని ఉదయగిరిలోని మెరిట్ ఇంజినీరింగ్ కళాశాల వరకూ తీసుకెళతారు. అక్కడ మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయి. ఇందుకోసం ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేశారు. ఈ వాహనాన్ని చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పించారు.
ఫేర్వెల్ ఆన్ వీల్స్....
ఈ వాహనం పేరు ఫేర్ వెల్ ఆన్ వీల్స్ అని పితుస్తారు. అంత్యక్రియల కోసం బెంజ్ కంపెనీ ప్రత్యేకంగా ఈ వాహనాన్ని రూపొందించింది. ఈ వాహనంలో ఏసీ, సీసీ కెమెరాలతోపాటు హైడ్రాలిక్ సిస్టమ్ కూడా ఉంటుంది. పార్ధీవదేహంతో పాటు మరికొందరు కూర్చునేందుకు వీలు ఉంటుంది. ఈ వాహనంలోనే మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవదేహాన్ని ఉదయగిరికి నెల్లూరు నుంచి తరలించనున్నారు.
Next Story