Tue Dec 24 2024 01:16:42 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జీవో నెంబరు 1పై హైకోర్టులో
జీవో నెంబరు 1పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ విచారణ చేపట్టనుంది.
జీవో నెంబరు 1పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ విచారణ చేపట్టనుంది. ఈరోజు వరకూ జీవో నెంబరు 1పై స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈరోజుతో గడువు పూర్తి కానుండటంతో విచారణ చేపట్టి దీనిపై నిర్ణయం తీసుకోనుంది. జీవో నెంబరు 1పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశ ఎదురయింది.
ఎదురు చూపులు...
హైకోర్టులోనే దీనిపై విచారణ జరపాలని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరుపుతుందని, తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన నేపథ్యంలో నేడు విచారణ జరగనుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జర్నలిస్ట్ తిలక్ లు వేసిన పిటీషన్లపై నేడు విచారణ జరపనుంది. మరో నాలుగు రోజుల్లో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఈరోజు హైకోర్టులో జరిగే విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ పార్టీలు హైకోర్టు ఉత్తర్వుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Next Story