Tue Nov 05 2024 14:54:50 GMT+0000 (Coordinated Universal Time)
గోదావరి వద్ద పెరుగుతున్న వరద ఉధృతి
గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 9.36 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 9.36 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈరోజు మధ్యాహ్నం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. దీంతో వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను అధికారులను అప్రమత్తం చేశారు. విపత్తుల సంస్థ లోతట్టు ప్రాంతాల వారికి కూడా హెచ్చరికలు జారీ చేసింది. గోదావరి నదిలోకి చేపల వేటకు వెళ్లొద్దని, బోట్లలో ప్రయాణించవద్దని సూచించింది.
రంగంలోకి దిగిన...
అల్లూరి జిల్లా కూనవరం, వీఆర్ పోరంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఎవరూ గోదావరి నదిలో సాహసం వంటివి చేయకూడదని, స్నానాలకు కూడా దిగవద్దని విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోరారు.
Next Story