Mon Dec 23 2024 11:59:27 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఇటీవలే ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయ ఉద్యోగుల..
సీఎం జగన్ ప్రభుత్వం ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి.. ఇప్పటి వరకూ.. అవివాహితులు, వితంతువులు, బార్యాభర్తలిద్దరూ వేర్వేరు చోట్ల పని చేస్తున్న వారు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, పరస్పర అంగీకార బదిలీ కోరుకుంటున్న వారికి మాత్రమే బదిలీ దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. తాజాగా 'ఇతరులు' అనే ఐచ్చికాన్ని కూడా చేర్చారు. ఈ కేటగిరీలో దివ్యాంగులు కూడా బదిలీలకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఇటీవలే ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. జిల్లాతో పాటు అంతర్ జిల్లాల్లో ఉద్యోగులకు కూడా బదిలీలకు అవకాశం కల్పించగా..అంతర్ జిల్లాల బదిలీల్లో స్పాస్, మ్యూచువల్ బదిలీలకు వీలు కల్పించారు. జూన్ 10వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగులు బదిలీలకు అప్లై చేసుకునే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. అయితే రెండేళ్లు పూర్తి అయ్యి ప్రొబేషన్ డిక్లేరైన వాళ్లే ఈ బదిలీలకు అర్హులు. ఈ బదిలీల్లో ఎలాంటి పైరవీలకు తావులేకుండా జరుగుతాయని స్పష్టం చేసింది. బదిలీల ప్రక్రియను ప్రారంభించి వెంటనే చేపట్టాలని సీఎం జగన్ కార్యాలయం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Next Story