Mon Dec 23 2024 18:38:29 GMT+0000 (Coordinated Universal Time)
అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 1146 మంది అర్చకులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. వారందరికీ జీతాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 10 వేల లోపు ఆదాయం ఉన్న అర్చకులకు రూ.10 వేలు జీతం ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 1146 మంది అర్చకులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. వారందరికీ జీతాలు పెరగనున్నాయని పేర్కొన్నారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మహిళా వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. పవన్ కు ఎన్ సీఆర్ బీ రిపోర్ట్ ఎలా ఇచ్చిందో తెలియదని, బహుశా అది చంద్రబాబు ఇచ్చిన రిపోర్టు అయి ఉండొచ్చన్నారు.
రాష్ట్రంలో వాలంటీర్ల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించామని, వాలంటీర్ల సేవలను ప్రధాని నరేంద్రమోదీతో సహా దేశమంతా మెచ్చుకుంటుంటే.. పవన్ మాత్రం అజ్ఞానంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఉన్మాదంతో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను చదువుతున్నాడని విమర్శించారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లు అందించిన సేవలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తే.. పవన్ మాత్రం హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story