Sun Jan 05 2025 02:49:25 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నేడు విడుదల చేయనుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నేడు విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు సులువుగా దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ప్రతి నెల టీటీడీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఈరోజు ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
జనవరి నెల కోటా...
శ్రీవారిని జనవరి నెలలో దర్శించుకోవాలనుకుంటున్న భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ లో మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. ఇప్పటికే జనవరి నెలకు సంబంధించి నిన్న శ్రీవాణి భక్తుల దర్శనం టిక్కెట్లతో పాటు వసతి కోటా టిక్కెట్లను కూడా టీటీడీ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Next Story