Sun Dec 22 2024 11:49:43 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీవారి భక్తులకు శుభవార్త..
తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి బోర్డు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆలయంలో ఆర్జిత సేవలను..
తిరుపతి : తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి బోర్డు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆలయంలో ఆర్జిత సేవలను పునః ప్రారంభించాలని టిటిడి నిర్ణయించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించి, భక్తులను అనుమతించాలని టిటిడి బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్ చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు నిర్వహించనుంది టిటిడి.
కోవిడ్ రాకముందు ఉన్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించి భక్తులు నేరుగా పాల్గొనే విధానంతో పాటు వర్చువల్ విధానం కూడా కొనసాగుతుందని టిటిడి తెలిపింది. వర్చువల్ సేవలను బుక్ చేసుకున్న భక్తులు.. నేరుగా పాల్గొనే అవకాశం ఉండదు. పైన తెలిపిన ఆయా సేవలకు బుకింగ్ చేసుకున్న భక్తులను కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ.. ఏప్రిల్ 1 నుంచి అనుమతించనుంది టిటిడి.
Next Story