Mon Dec 23 2024 07:22:34 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త
ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో టిటిడి శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. కోవిడ్ తగ్గుతున్న నేపథ్యంలో
కరోనా కారణంగా శ్రీవారిని పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకునే వీలు లేకుండా పోయింది. కరోనా మొదలు.. నిన్న మొన్నటి వరకూ టిటిడి భక్తులకు పరిమిత సంఖ్యలోనే దర్శనం టికెట్లు ఇచ్చింది. అది కూడా అంతా ఆన్ లైన్లో కావడంతో.. చాలా మంది భక్తులకు స్వామివారిని దర్శించుకునే వీలు లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో టిటిడి శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. కోవిడ్ తగ్గుతున్న నేపథ్యంలో దర్శన టికెట్లను పెంచుతూ టిటిడి నిర్ణయం తీసుకుంది.
Also Read : సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
నేటి నుంచి ఆఫ్ లైన్లో భక్తులకు 20 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తోంది. ఇక పై ప్రతి రోజూ ఆఫ్ లైన్లో సర్వదర్శనం టికెట్లను జారీ చేయనుంది. అలాగే ఈ నెల 24వ తేదీ నుంచి రూ.300కే ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్ల కోటాను 25 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. రేపు ఉదయం 9 గంటలకు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31వ తేదీకి సంబంధించిన టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది.
Next Story