Mon Dec 23 2024 06:42:07 GMT+0000 (Coordinated Universal Time)
భక్తులకు టిటిడి గుడ్ న్యూస్
గతేడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టుమార్గం ధ్వంసమైంది. అప్పట్నుంచి..
శ్రీవారి భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ చెప్పింది. మే 1వ తేదీ నుంచి శ్రీవారి మెట్టుమార్గాన్ని పునరుద్ధరించనున్నట్లు టిటిడి ప్రకటించింది. గతేడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టుమార్గం ధ్వంసమైంది. అప్పట్నుంచి మెట్లమార్గాన్ని తాత్కాలికంగా మూసివేసిన టిటిడి.. మరమ్మతు పనులు చేపట్టింది. మరమ్మతు పనులు పూర్తికావడంతో.. ఐదు నెలల తర్వాత శ్రీవారి మెట్టుమార్గం తెరచుకోనుంది.
ఈ సందర్భంగా టిటిడి సభ్యుడు పోకల అశోక్ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడేలా మెట్ల మార్గాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి అలిపిరి మెట్లమార్గమే అందుబాటులో ఉండగా.. మే 1నుంచి శ్రీవారి మెట్టుమార్గం కూడా అందుబాటులోకి రానుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది.
Next Story