Mon Dec 23 2024 12:37:42 GMT+0000 (Coordinated Universal Time)
రాజమండ్రి రూరల్ లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి విజయం
రాజమండ్రి రూరల్ లో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఘన విజయం
రాజమండ్రి రూరల్ లో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఘన విజయం సాధించారు. 61,564 ఓట్ల మెజార్టీతో బుచ్చయ్య చౌదరి విజయం అందుకున్నారు. రాజమహేంద్రవరం (గ్రామీణం) టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 63,056 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ కూటమి పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది. 152 స్థానాల్లో టీడీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా 127 స్థానాల్లో గెలుపు ఖాయమని తేలిపోయింది. శ్రీకాకుళంలోని 10 స్థానాల్లో 8 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉండగా బీజేపీ, వైసీపీ చెరో స్థానంలో ముందంజలో ఉన్నాయి. జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కృష్ణాలో 16 స్థానాలకు గాను టీడీపీ 13, జనసేన 2, బీజేపీ ఒక స్థానంలో, ప్రకాశంలో 12 స్థానాలకు గాను 8 స్థానాల్లో టీడీపీ, నాలుగు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. గుంటూరులో 17 స్థానాలకు గాను 16 సీట్లలో టీడీపీ, ఒక స్థానంలో జనసేన ఆధిక్యంలో ఉంది.
Next Story