Mon Dec 23 2024 12:11:06 GMT+0000 (Coordinated Universal Time)
చీకటి జీవో అనడం సరికాదు
రోడ్లపై సమావేశాలు వద్దనడం చీకటి జీవో అనడం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
రోడ్లపై సమావేశాలు వద్దనడం చీకటి జీవో అనడం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జీవోలో ఉన్న నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకే కాదని, వైసీపీకి కూడా వర్తిస్తాయని ఆయన తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్ లో సభలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించకూడదని జీవోలో ఎక్కడా లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
అనువైన ప్రదేశాల్లో...
అనువైన ప్రదేశాల్లో సభలు నిర్వహించుకోవచ్చని జీవోలో ప్రభుత్వం పేర్కొందని తెలిపారు. కందుకూరు, గుంటూరులలో ఏం జరిగిందో చూశాం కదా? అని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాల కంటే రాజకీయం ముఖ్యం కాదని గుర్తుంచుకోవాలన్నారు. అందరికీ ఒకే జీవో వర్తిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏదైనా గ్రౌండ్ లో అనుమతి తీసుకుని ఎంతమందితోనైనా సభలు పెట్టుకోవచ్చని ఆయన తెలిపారు.
Next Story