Sun Dec 22 2024 18:10:02 GMT+0000 (Coordinated Universal Time)
గెస్ట్ ఆర్టిస్ట్ మళ్లీ వచ్చాడే : పవన్ పై సజ్జల సెటైర్
గెస్ట్ ఆర్టిస్ట్ లా వచ్చి పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడి పోతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
గెస్ట్ ఆర్టిస్ట్ లా వచ్చి పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడిపోతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళుతున్నారన్నారు. పవన్ కల్యాణ్ నాలుగో ఆప్షన్ గా చంద్రబాబుకు మద్దతు అని చెప్పాల్సి ఉండిందని సజ్జల ఎద్దేవా చేశారు. సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని పవన్ ఎలా చెప్పగలరన్నారు. అందుకు ఆయన వద్ద ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు.
ఇంతకూ ఎవరు సీఎం?
నిజంగా మీ ఇద్దరిలో ఎవరు సీఎం అభ్యర్థి ఎవరో చెప్పి ఎన్నికలకు వెళ్లగలరా? అని సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే పొత్తుకు వెళుతున్నావో ప్రజలకు వపన్ స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రజలకు కూడా ఒక స్పష్టత ఇస్తే బాగుంటుందని అన్నారు. లోకేష్ పాదయాత్ర చేయడానికి వాళ్ల నాన్నను ముఖ్యమంత్రిగా చేయమని కోరతారా? అని ప్రశ్నించారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆంక్షలున్నాయని సజ్జల అన్నారు.
Next Story