Sun Dec 22 2024 18:58:23 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు వల్లనే ఛార్జీలు పెంచుతున్నాం
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు ఛార్జీలను పెంచలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు ఛార్జీలను పెంచలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విపక్షాలు చెబుతున్నట్లు ఐదుసార్లు జగన్ ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను పెంచిందని చెప్పడం అవాస్తవమని చెప్పారు. చంద్రబాబు చేసిన నిర్వాకం వల్లనే విద్యుత్తు ఛార్జీలను పెంచాల్సి వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ విష ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చెప్పారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్లనే తాము స్వల్పంగా విద్యుత్తు ఛార్జీలను పెంచాల్సి వస్తుందని చెప్పారు.
అడ్డుగోలు ఒప్పందాల వల్లనే...
ీటీడీపీ హయాంలో అడ్డగోలుగా విద్యుత్తును కొని అప్పుల భారాన్ని పెంచారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆ అప్పులను తీర్చడానికే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వస్తుందని చెప్పారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విపక్షాలు విష ప్రచారం చేయడం మినహా వాస్తవాలను ప్రజల ముందుంచడం లేదని చెప్పారు. మూడేళ్లలో తాము విద్యుత్తు ఛార్జీలను పెంచలేదని ఆయన గుర్తు చేశారు.
Next Story