Mon Dec 23 2024 10:43:03 GMT+0000 (Coordinated Universal Time)
ఉండవల్లికి కౌంటర్ ఇచ్చిన సజ్జల
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విమర్శలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విమర్శలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే తొలుత స్వాగతించేది వైసీపీయేనని ఆయన పేర్కొన్నారు. రాష్టర్ర విభజన తీరును సవాల్ చేస్తూ మాత్రమే సుప్రీంకోర్టులో కేసు ఉందని, విభజన చట్టం అసంబద్ధమని పిటీషన్ వేశారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
ఆ మూడు పార్టీలే...
తాము తొలి నుంచి సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడామన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు తొలి నుంచి పోరాటం చేసింది వైసీపీయేనని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనకు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు కలసి కారణమయ్యాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కుదిరితే తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.
Next Story