Fri Apr 11 2025 18:57:28 GMT+0000 (Coordinated Universal Time)
సాధ్యం కాకపోవచ్చు
సీపీఎస్ ను రద్దు చేయడం సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు

సీపీఎస్ ను రద్దు చేయడం సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దాని వల్ల ప్రభుత్వంపై వేల కోట్ల భారం పడుతుందని అభిప్రాయపడ్డారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు భద్రత కల్పించడం ప్రభుత్వం విధి అని ఆయన ఒప్పుకుంటేనే బడ్జెట్ సహకరిస్తేనే ఏదైనా చేయగలుగుతామని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
సాంకేతిక అంశాలు...
గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ సీపీఎస్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే సాంకేతిక అంశాలను పరిశీలించిన తర్వాత అది సాధ్యం కాకపోవచ్చని అనిపిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో అనేక ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Next Story