Tue Dec 24 2024 18:39:19 GMT+0000 (Coordinated Universal Time)
బాబు పబ్లిసిటీ పిచ్చి 8మందిని బలి తీసుకుంది
చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే ఇరుకు రోడ్డులో సభ పెట్టారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే ఇరుకు రోడ్డులో సభ పెట్టారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వంద అడుగుల రోడ్డును ఫ్లెక్సీలు కట్టి ముప్ఫయి అడుగుల రోడ్డుగా మార్చారు. ఇరువైపు ఫ్లెక్సీలు కట్టి ఇరుకుగా మార్చారన్నారు. జనం ఎక్కువగా వచ్చారని పబ్లిసిటీ ఇచ్చుకునేందుకే ఈ విధంగా వ్యవహరించారన్నారు. ఇంత జరిగాక, ఇంతమంది చనిపోయాక కనీసం పశ్చాత్తాపం లేదని సజ్జల అన్నారు. ఈ ఘటన నుంచి సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారు తప్పించి చంద్రబాబు మరొకటి కాదని అన్నారు. నిబంధనలను కూడా పాటించలేదన్నారు. తాను అనుకున్నదే జరగాలని చంద్రబాబు భావిస్తారని, అందుకు పరాకాష్ట కందుకూరు ఘటన అని సజ్జల అన్నారు.
ఇరుకైన రోడ్డులో...
ప్రభుత్వంపై ఆగ్రహంతో జనం తండోపతండాలుగా వస్తున్నారని సిగ్గులేకుండా వస్తున్నారని అన్నారు. ఈ ఘటనకు చంద్రబాబు మాత్రమే బాధ్యత వహించాలని అన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి ఎనిమిది మంది బలయ్యారన్నారు. త్యాగం చేసినట్లు చెప్పుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. సభకు ప్రాణాలు పోగొట్టుకోవడానికి వస్తారా? అని సజ్జల ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాల్లో భక్తులను బలి తీసుకున్నాడని అన్నారు. ఇంతకంటే నీచమైనది ఏమైనా ఉంటుందా? ఆయన నిలదీశారు. చంద్రబాబు ఇప్పటికైనా ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకుంటారో? లేదో? చూడాలన్నారు. పోలీసుల అనుమతి తీసుకున్న చోట సభను ఎందుకు నిర్వహించలేదన్నారు.
Next Story