Mon Dec 23 2024 13:49:40 GMT+0000 (Coordinated Universal Time)
ఆయన ఉంటే అమెరికా ..లేకుంటే శ్రీలంక
చంద్రబాబు రాష్ట్రానికి ప్రధమ శత్రువుగా తయారయ్యారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
చంద్రబాబు రాష్ట్రానికి ప్రధమ శత్రువుగా తయారయ్యారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పాత ఫొటోలతో చంద్రబాబు బురిడీ రాజకీయం చేస్తున్నారన్నారు. మైనింగ్ మాఫియా ఫొటో ఎగ్జిబిషన్ అంటూ బాబు బరితెగింపుకు ఇవిగో సాక్ష్యాలు అంటూ సజజల మీడియా ముందు కొన్ని ఫొటోలను ప్రదర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఏపీ అమెరికా అవుతుందని, లేకుంటే శ్రీలంక అవుతుందని ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తుందని సజ్జల విమర్శించారు. చంద్రబాబు ఆరోపణలన్నీ సోషల్ మీడియాలో జోకుల్లా పేలుతున్నాయన్నారు.
ఏదో జరిగిపోతుందంటూ...
రాష్ట్రంలో ఏదేదో జరిగిపోతుందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చంద్రబాబు ఆయన అనుకూల మీడియా చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కంకర తవ్వకుండా ఎవరైనా రోడ్డు వేయగలరా? సిమెంటు లేకుండా భవనాలను నిర్మించగలరా? చంద్రబాబు తరహాలో తాము గ్రాఫిక్స్ చూపలేమని ఆయన అన్నారు. ప్లీనరీ సక్సెస్ కావడంతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిందని సజ్జల అన్నారు. చంద్రబాబు పాలనలోనే అక్రమ మైనింగ్ జరిగిందని, కొండలను తవ్వేశారని అన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే రోడ్లన్నంటినీ బాగు చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Next Story