Tue Dec 24 2024 01:55:51 GMT+0000 (Coordinated Universal Time)
కరకట్ట ఇల్లు అక్రమాలకు అడ్డా
కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లు అక్రమాలకు అడ్డా వంటిదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లు అక్రమాలకు అడ్డా వంటిదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అక్రమ కట్టడంలో చంద్రబాబు ఎలా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. కృష్ణా నదిని ఆక్రమించిన కట్టడంలో నివసిస్తూ అక్రమ కట్టడాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఉచితంగా ఇస్తారా?
చంద్రబాబు తన ఉంటున్న ఇంటికి అద్దె చెల్లించకుండా ప్రభుత్వం నుంచి మాత్రం ఇంటి అలవెన్సును పొందుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. లింగమనేని రమేష్ ఉచితంగా చంద్రబాబుకు ఆ ఇల్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అమరావతిలోని భూములను సొంతం చేసుకునేందుకే లింగమనేని చంద్రబాబుకు ఈ గెస్ట్హౌస్ ఉండేందుకు ఇచ్చారన్నారు. ఉచితంగా ఎందుకుంటున్నారని ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని, చట్ట ప్రకారమే నడుచుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Next Story