Tue Nov 05 2024 16:18:25 GMT+0000 (Coordinated Universal Time)
ప్రభుత్వానికి బరువు అయితే ఎలా?
సీపీఎస్ పై ఉద్యోగులు ఆలోచించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
సీపీఎస్ పై ఉద్యోగులు ఆలోచించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు వ్యవహరించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా ఎప్పుడూ ఉంటారని ఆయన తెలిపారు. జీపీఎస్ విధానంలో కొన్ని మార్పులు చేసి అమలు చేయనున్నామని తెలిపారు. పాత పెన్షన్ విధానం ప్రభుత్వానికి భారంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జీపీఎస్ లో బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు. మార్పులు, చేర్పులు ఉంటే చర్చించవద్దని ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రతిపాదనలను ఉద్యోగులు పరిశీలించాలని ఆయన కోరారు.
జీపీఎస్ పై ఆలోచించండి....
సీపీఎస్ లో ఉన్న లోపాలను సరిచేసి జీపీఎస్ ను తేవడం జరిగిందన్నారు. రాజకీయంగా ఆలోచిస్తే ఓపీఎస్ కు అంగీకరించేవారని, కానీ రాష్ట్ర పరిస్థితి దృష్టిలో ఉంచుకుని ఏ నిర్ణయమైనా తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగితో పాటు భార్య కు కూడా బీమా సౌకర్యం జీపీఎస్ లో కల్పిస్తున్నామని తెలిపారు. మరోసారి సమావేశమై ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. అయినా ఉద్యోగులు ఆందోళన చేస్తామంటే తాము ఏమీచేయలేమని అన్నారు.
Next Story