Sat Apr 12 2025 01:20:32 GMT+0000 (Coordinated Universal Time)
27వ తేదీన మరోసారి చర్చలకు పిలిచాం
మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకున్న అపోహలను తొలగించే ప్రయత్నం చేసిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలకున్న అపోహలను తొలగించే ప్రయత్నం చేసిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంత్రుల కమిటీ వద్దకు వచ్చిన స్టీరింగ్ కమిటీ సభ్యులతో చర్చలు జరిపామన్నారు. జీతాలు తగ్గాయన్న అపోహలో ఉండటం మంచిది కాదని వారికి సూచించినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అయితే మరోసారి ఈ నెత 27వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఎప్పుడైనా సిద్ధమే...
పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారని, వాటి వల్ల నష్టం లేదని, తర్వాతనైనా సవరించుకోవచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అయితే తమ వద్దకు వచ్చిన స్టీరింగ్ కమిటీ సభ్యులు తమ నేతలతో చర్చించి చెప్తామని చెప్పి వెళ్లారన్నారు. ఫిట్ మెంట్ కు సంబంధించి ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని, వారితో చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Next Story