Thu Dec 19 2024 09:44:01 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్థిక పరిస్థితి బాగా లేదు... అర్థం చేసుకోండి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఉన్నంతలో కొంత ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఉన్నంతలో కొంత ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము అనుకున్నదానికంటే కొంత ఎక్కువ ఆలోచనలోనే జగన్ ఉన్నారని ఆయన తెలిపారు. త్వరలోనే ఉద్యోగుల పీఆర్సీపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఉద్యోగులు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థిితిని అర్ధం చేసుకుని తమ డిమాండ్లను సవరించుకుంటే బాగుంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. జగన్ తో అధికారులు పీఆర్సీపై సమీక్ష ముగిసిన అనంతరం సజ్జల ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు వెనకుండి....
మరోవైపు బీజేపీ కొన్ని అంశాలపైనే ఆధారపడి రాజకీయం చేస్తుందన్నారు. మతం మీదనే దాని మనుగడ ఆధారపడి ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అయితే బీజేపీ ఈరోజు జరిపిన సభ వెనక చంద్రబాబు ఉన్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నుంచి వెళ్లిన కొందరు అక్కడ ప్రధాన భూమిక పోషిస్తూ బీజేపీలో చంద్రబాబు అజెండాను అమలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంతో సర్దుకు వెళ్లాలన్న ధోరణితోనే తాము ఉన్నామని ఆయన తెలిపారు.
Next Story