Sun Apr 06 2025 04:33:36 GMT+0000 (Coordinated Universal Time)
చర్చలకు వెళతారా.... లేదా?
సమ్మె తప్పదనుకుంటున్న సమయంలో ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చింది. చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పంపింది

సమ్మె తప్పదనుకుంటున్న సమయంలో ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చింది. చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పంపింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో జిరిగే మంత్రుల కమిటీతో చర్చించాలని పీఆర్సీ సాధన సమితిలో ఉన్న 20 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులకు ఆహ్వానం పంపింది. తమకు లిఖితపూర్వకంగా ఆహ్మానం అందితే చర్చలకు వెళతామని నిన్న ఉద్యోగ సంఘాలు చెప్పిన వెంటనే ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది.
చర్చలకు వెళ్లకుండా....
అయితే ఈరోజు చర్చలకు ఉద్యోగ సంఘాలు వెళతాయా? లేదా? అన్న సందిగ్దత నెలకొంది. తాము చెప్పిన మాట ప్రకారం చర్చలకు వెళితేనే మంచిదని సూచిస్తున్నారు. సమ్మెకు ఇంకా సమయం ఉండటంతో ఈ ఐదు రోజులు చర్చలకు వెళితే తప్పేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చీఫ్ సెక్రటరీ సయితం ఉద్యోగులను సమ్మెకు వెళ్లకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు చర్చలకు వెళతాయా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.
Next Story