Mon Dec 23 2024 18:02:54 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఉద్యోగ సంఘాల ఆందోళన... అంబేద్కర్ విగ్రహాలకు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కొత్తగా జారీ చేసిన పీఆర్సీ జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కొత్తగా జారీ చేసిన పీఆర్సీ జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిన్న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు నేడు అంబేద్కర్ విగ్రహాల వద్ద వినతి పత్రాలను ఉంచి తమ నిరసనను తెలియజేయనున్నారు.
అంబేద్కర్ విగ్రహాలకు...
ప్రభుత్వం తమ గోడు విన్పించుకోవడం లేదని, చర్చలకు పిలుస్తున్నా తమను బుజ్జగించడానికే రమ్మంటున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందుకే తాము జీవోను రద్దు చేసి, అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దశలవారీగా ఉద్యమం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నారు.
Next Story