Sat Apr 26 2025 09:26:53 GMT+0000 (Coordinated Universal Time)
13న ఏపీలో ప్రైవేటు స్కూల్స్కు సెలవు
ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది

ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల్లోని విద్యాసంస్థలు ఈ నెల 13న మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు కూడా ఎన్నికల అధికారి సెలవు ప్రకటించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు...
మార్చి 13న ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి. 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఎనిమిది స్థానిక సంస్థలు, రెండు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు జరగనున్నాయి. ఆరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ పోలింగ్ జరుగుతుండగా సెలవును ప్రకటించారు. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఇప్పటికే ఈ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంది.
Next Story