Mon Dec 23 2024 09:57:08 GMT+0000 (Coordinated Universal Time)
విద్యుత్తు శాఖ లైన్మెన్ కు ఆర్థిక సాయం
విద్యుత్ శాఖ లైన్మెన్ వజ్రాల కోటేశ్వరరావు కుటుంబానికి ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.
విద్యుత్ శాఖ లైన్మెన్ వజ్రాల కోటేశ్వరరావు కుటుంబానికి ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. ఇటీవల సంభవించిన వరదల్లో ఆయన మృతి చెందడంతో కుటుంబానికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం సాయం చేసింది. విద్యుత్తు, ప్రభుత్వపరంగా 31 లక్షలు రూపాయల పరిహారంకోటేశ్వరరావు భార్యకు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందచేశారు.
ప్రభుత్వ ఉద్యోగంతో పాటు...
బాధిత కుటుంబం ఇంటికెళ్లి స్వయంగా గొట్టిపాటి రవి వెళ్లి పరిహారం అందజేశారు. కోటేశ్వరరావు భార్యకు విద్యుత్ శాఖలో ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. ఇద్దరు పిల్లల చదువుకు రూ.25 వేలు చొప్పున ఆర్థిక తోడ్పాటు అందిస్తామని గొట్టిపాటి రవి ప్రకటించారు. మరో రూ.30 లక్షలు బెన్ఫిట్స్ త్వరలోనే అందేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
News Summary - government has announced financial assistance to the family of vajrala koteswara rao, lineman of the electricity department
Next Story