Sat Dec 21 2024 13:43:55 GMT+0000 (Coordinated Universal Time)
వరదలకు ఏపీలో మృతుల సంఖ్య 31
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ లో 31 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ లో 31 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 23 మంది వరదల కారణంగా మరణించారని చెప్పింది. తర్వాత గుంటూరు జిల్లాలో ఏడుగురు మృతి చెందారు. పల్నాడు జిల్లాలో ఒకరు మరణించారని ప్రభుత్వం తెలిపింది.
భారీ వర్షాలకు పశువులు...
దీంతో పాటు 212 పశువులు, 60 వేల కోళ్లు మరణించాయని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. అయితే ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు ప్రకటించినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో 11 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో వాటిని దిగువకు వదిలారు. దీంతో పాటు బుడమేరు పొంగి ఈ వరదలు సంభవించాయి.
Next Story