Tue Dec 24 2024 02:46:57 GMT+0000 (Coordinated Universal Time)
లంచ్ మోషన్ పిటీషన్ వేసిన ప్రభుత్వం
సినిమా టిక్కెట్ల పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 35 కొట్టివేయడంపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.
సినిమా టిక్కెట్ల పై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 35ను కొట్టివేయడంపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. లంచ్ మోషన్ పిటీషన్ వేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్ లో పిటీషన్ దాఖలు చేసింది. సామాన్య ప్రజలకు టిక్కెట్ల ధరలను అందుబాటులో ఉంచేందుకే ఈ జీవోను తీసుకు వచ్చామని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు వాదిస్తున్నారు.
అందువల్లే జీవో....
ఆంధ్రప్రదేశ్ లో వినోదం ప్రధానంగా సినిమాయేనని, అందుకే సామాన్యులకు టిక్కెట్ల ధరలు అందుబాటులో ఉంచేందుకు ఈ జీవోను తెచ్చామని చెప్పారు. దీనివల్ల ఎవరికీ నష్టం లేదని ప్రభుత్వం తరుపున న్యాయవాదులు చెబుతున్నారు. దీనిపై మరికాసేపట్లో వాదనలు ప్రారంభం కానున్నాయి.
Next Story