Sat Dec 21 2024 00:06:11 GMT+0000 (Coordinated Universal Time)
27 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. రెండో రోజు సంతాప తీర్మానాలు ఉంటాయి. తర్వాత సభను వాయిదా వేస్తారు.
13 రోజుల పాటు...
తిరిగి మార్చి 6వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలు మొత్తం పదమూడు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. అయితే దీనిపై రేపు సాయంత్రానికి స్పష్టత వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Next Story