Mon Dec 23 2024 07:25:44 GMT+0000 (Coordinated Universal Time)
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ లో పరిమితంగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్ లో పరిమితంగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 502 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు, మ్యూజిక్, ఆర్ట్, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులు ఉన్నాయి.
రేపు వెబ్సైట్ లో....
దీంతో పాటు ఏపీ మోడల్ స్కూళ్లు, బీసీ సంక్షేమ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీ నియామకానికి కూడా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిసింది. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. రేపు cse.ap.gov.in వెబ్ సైట్ ను పరిశీలించవచ్చని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.
Next Story