Mon Dec 23 2024 16:23:26 GMT+0000 (Coordinated Universal Time)
విద్యార్థులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులకు సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థులకు సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో స్కూళ్లకు సంక్రాంతి సెలవును పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు కూడా కోరాయి. తొలుత సంక్రాంతి సెలవులను ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకూ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
టీచర్ల సంఘాల విజ్ఞప్తి మేరకు...
ఈ నెల 17వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలసి సంక్రాంతి సెలవులపై వినతి పత్రాన్ని అందచేశారు. ఈ నెల 18వ తేదీ వరకూ పొడిగించాలని కోరాయి. అయతే ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదన పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ సానుకూలంగా స్పందించారని తెలిపాయి.
Next Story