Mon Dec 16 2024 15:34:20 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : గుడ్ న్యూస్...ఈ నెల ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో పింఛనుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒక రోజు ముందుగా పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ లో పింఛనుదారులకు గుడ్ న్యూస్‌ను ప్రభుత్వం చెప్పింది. ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరు 1న ఆదివారం రావడంతో సెలవు దినం రోజు కంటే ముందుగానే పింఛన్ల పంపిణీ జరగనుంది.
ఆదివారం రావడంతో...
ఈ నెల 31వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పింఛన్ల పంపిిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. సుమారు 65 లక్షల మందికి పైగా వృద్ధులకు నాలుగు వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తారు. దివ్యాంగులకు ఆరువేల రూపాయలు ఇవ్వనున్నారు. 31వ తేదీన అందని వారికి పింఛన్లు సెప్టంబరు 2వ తేదీన అందుతాయని తెలిపింది.
Next Story