Tue Dec 24 2024 01:58:28 GMT+0000 (Coordinated Universal Time)
గ్రామ సచివాల ఉద్యోగులకు గుడ్ న్యూస్
గ్రామవార్డు సచివాలయం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రభుత్వం అనుమతి తెలిపింది
గ్రామవార్డు సచివాలయం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రభుత్వం అనుమతి తెలిపింది. రెండు సంవత్సరాలు సచివాలయం ఉద్యోగిగా పూర్తి చేసుకున్న వారందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ఈ ఫైలుపై సంతకం పెట్టారు. ప్రభుత్వం చెప్పినట్లుగానే జూన్ నెలలలోనే వారికి ప్రొబేషన్ ను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు.
జగన్ ఆదేశాలతో....
అంతేకాకుండా జగన్ ఆదేశాలతో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వడానికి సిద్ధమయింది. కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలు వార్డు సచివాలయం ఉద్యోగులకు అందుతాయయని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు.
News Summary - government has good news for the village ward secretariat employees. government approved the probation declaration
Next Story