Mon Dec 23 2024 10:40:04 GMT+0000 (Coordinated Universal Time)
నేడు డెడ్ లైన్ ముగియనుంది.. ఏం చేయనున్నారో?
అంగన్వాడీలకు ఈరోజు ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఈరోజు విధుల్లోకి చేరకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మెకు ఈరోజు ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఈరోజు లోపు విధుల్లోకి చేరకుంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంతో అంగన్ వాడీ వర్కర్లు ఈరోజు విధుల్లో చేరతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. అయితే ఎస్మా పెట్టినా తాము సమ్మెను కొనసాగించి తీరుతామని అంగన్ వాడీ కార్మికులు చెబుతున్నారు. మరో వైపు ఈరోజు సాయంత్రంలోగా విధుల్లో చేరాలని వారి సెల్ఫోన్లకు మెసేజ్ లు వస్తున్నాయి.
విధుల్లో చేరని వారికి....
విధుల్లో చేరని వారికి నోటీసులు జారీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గత కొద్ది రోజులుగా అంగన్ వాడీ వర్కర్లు సమ్మె చేస్తుండటంతో కేంద్రాల్లో శిశువులు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం చెబుతుంది. నెలకు ఇరవై నాలుగు వేల రూపాయల వేతనం ఇవ్వాలన్న డిమాండ్ తో అంగన్ వాడీలు గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం మాత్రం కొన్ని డిమాండ్లను పరిష్కరించి వేతనాల పెంపుదల విషయంలో కొంత నాన్చడంతో సమ్మె అనివార్యంగా మారింది.
Next Story