Mon Dec 23 2024 18:09:23 GMT+0000 (Coordinated Universal Time)
అందరికీ కొత్త జీతాలే
ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సమయంలోనే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య గ్యాప్ మరింత పెరుగుతుంది. ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సమయంలోనే కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య వార్ మరింత ముదిరే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఉద్యోగుల్లో అసహనం....
తమకు జనవరి నెల జీతం పాత జీతమే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొత్త పీఆర్సీ ప్రకారం వద్దని చీఫ్ సెక్రటరీకి కూడా లేఖ ఇచ్చాయి. పీఆర్సీ పై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను కూడా రద్దు చేయాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలంటూ ఆర్థిక శాఖ మెమో జారీ చేయడాన్ని ఉద్యోగ సంఘాలు తప్పుపడుతున్నాయి.
Next Story