Mon Dec 23 2024 17:05:39 GMT+0000 (Coordinated Universal Time)
ఉత్తర్వులు జారీ.. అమరావతి రైతులకు దెబ్బ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని ఎస్-3 జోన్లో పేదలకు 268 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని ఎస్-3 జోన్లో పేదలకు 268 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఎస్-3 జోన్ లో 268 ఎకరాలు కేటాయించింది. ఆర్-5 జోన్ లో కేటాయించిన 1,134 ఎకరాలకు అదనంగా 268 ఎకరాలు కేటాయిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు.
అదనంగా 268 ఎకరాలు...
గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో లబ్దిదారుల సంఖ్య మేరకు ఇప్పటికే కలెక్టర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. కలెక్టర్ల లేఖ మేరకు అదనపు భూమి కేటాయింపునకు సీఆర్డీఏ ప్రతిపాదన రూపొందించి ప్రభుత్వానికి పంపింది. సీఆర్డీఏ సిఫారసు మేరకు 268 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతవరం, నెక్కల్లు, పిచ్చుకలపాలెం, బోరుపాలెంలో భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Next Story