Mon Dec 23 2024 05:54:44 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రగిరిలో మరో వివాదం
చంద్రగిరిలో పోలీస్ క్వార్టర్స్ కు చెందిన మూడు ఎకరాల స్థలాన్ని వైసీపీకి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వైసీపీ పార్టీ కార్యాలయం స్థలం కేటాయింపు వివాదంగా మారుతుంది. అధికార వైసీపీ చంద్రగిరిలో పోలీస్ క్వార్టర్స్ కు చెందిన మూడు ఎకరాల స్థలాన్ని వైసీపీకి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు ఎకరాలకు ఏడాదికి మూడు వేల రూపాయల చొప్పున 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
టీడీపీ ఆందోళన...
అయితే ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించడాన్ని టీడీపీ తప్పు పడుతుంంది. పోలీస్ క్వార్టర్ స్థలాన్ని వైసీపీ కార్యాలయాలకు కేటాయించడం దారుణమని, దీనిని తాము అడ్డుకుంటామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇది చంద్రగిరి ప్రాంతంలో వివాదంగా మారింది.
Next Story